నవతెలంగాణ డిచ్ పల్లి
మండలంలోని అతి పురాతనమైన ఖిల్లా రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి తిరుక్కల్యాణోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఆలయాన్ని తమిళనాడు లోని శ్రీవిల్లుపుత్తూరు జీయర్ స్వామి సందర్శించిప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భక్తుల నుద్దేశించి మాట్లాడారు.శ్రీసీతారామచంద్రస్వామి దీక్షానగరంలో వెలిశాడు అంటే ఇదిర వేదభూమి కావున భక్తులు నిత్యం శ్రీ రామజపం చేయడం వల్ల లోక కల్యాణం జరుగుతుందన్నారు. ఆలయ పరిరక్షణ అంటే మనల్ని మనం రక్షించుకోవడం అని అర్ధమన్నారు. ధర్మోరక్షతి రక్షితః ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందన్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆయన సూచించారు. ఆలయకమిటీ ఆధ్వర్యంలో స్వామిజీ ని శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు.
ఘనంగా గరుడ సేవ..
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీసీతారామచంద్రస్వామి వారికి ఘనంగా గరుడోత్సవం నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు. అంతకుముందు హోమం,
శ్రీ రామజపం చేయడం వల్ల లోక కల్యాణం జరుగుతుందన్నారు. ఆలయ పరిరక్షణ అంటే మనల్ని మనం రక్షించుకోవడం అని అర్ధమన్నారు. ధర్మో రక్షతి రక్షితః ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందన్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆయన "సూచించారు. ఆలయకమిటీ ఆధ్వర్యంలో స్వామిజీ ని శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఘనంగా గరుడ సేవ.. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీసీతారామచంద్రస్వామి వారికి ఘనంగా గరుడోత్సవం నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు. అంతకుముందు హోమం, బలిహరణం నిర్వహించారు. రాత్రికి గరుడ వాహనంపై గ్రామంలోని ప్రధాన వీధులగుండా ఉత్సవమూర్తులతో ఊరేగించారు. ఈ సందర్భంగా రామనామంతో భక్తులు స్మరించారు. ఈ కార్యక్రమంలో ఖిల్లారామాలయ చైర్మన్ పోద్దుటూరి మహేందర్రెడ్డి, సర్పంచి గడ్డం రధకృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ ఆసది రవీందర్, ఎంపీటీసి కోత్తురు మానససాయి, విండో చైర్మెన్ గజవాడ జైపాల్, వీడీసీ సభ్యులు బూస నర్సయ్య, గట్టవలి సాగర్, ఆర్చకులు సుమిత్ శర్మ దేశ్పాండే, ప్రదీప్ క్పాండే, మర్రి శ్రీధరాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Feb,2023 06:58PM