- వీసం సమ్మయ్య చల్వాయి సర్పంచ్.
నవతెలంగాణ-గోవిందరావుపేట
తాను సర్పంచి పదవి కాలం పూర్తయ్యలోగా సాధ్యమైనంత వరకు వీధులన్నీ సిసి రోడ్డు గ మార్చాలన్నది తన ముందున్న లక్ష్యమని చల్వాయి గ్రామ సర్పంచ్ వీసం సమ్మయ్య అన్నారు. శనివారం మండలంలోని ఫ్రూట్ ఫారం గ్రామంలో సమ్మక్క సారమ్మ గుడి నుండి ఫ్రూట్ ఫారం వరకు 100 మీటర్ల సిసి రోడ్డును పూజా కార్యక్రమాలతో సమ్మయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సమ్మయ్య మాట్లాడుతూ ఎన్నికకు ముందు తాను ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేసినట్లు తెలిపారు. ముందు ముందు కూడా ఎంతో అభివృద్ధిని సాధించాలని అందుకోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. సమ్మక్క సారలమ్మ దయతోనే అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తున్నట్లు అందుకు పంచాయితీ పాలకవర్గం మరియు ప్రజల సహకారం అధికారుల అండ ఎంతో ఉందని అన్నారు చల్వ ఎంపిటిసి 1 గుండెబోయిన నాగలక్ష్మి వార్డ్ నెంబర్ 2 సామా రామ్ రెడ్డి జెట్టి సోమయ్య బురెడ్డి మధు బుడిగే రఘువీరు ఇసం శివ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Feb,2023 06:59PM