నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రం శివారులో ఉన్న ప్రసిద్ధ రేణుక ఎల్లమ్మ ఆలయ 47 వ వార్షికోత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం గణపతి పూజ, ఆలయ ఆవరణలో ఉన్న గ్రామదేవతలకు పూజలు నిర్వహించిన గౌడ సంఘ సభ్యులు పట్టణంలో కాటమయ్య ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా డప్పు చప్పుల మధ్య తీసుకెళ్లారు. ఆలయ వార్షికోత్సవంలో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు సంఘ సభ్యులు సిద్ధ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ గౌడ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm