- ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు
- వరదబట్టు వేణురాజ్
నవతెలంగాణ కంఠేశ్వర్
ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అక్రమ అరెస్టును నిరసిస్తూ ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వరదబట్టు వేణురాజ్ మాట్లాడుతూ.. ఎస్ఐ - కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో రన్నింగ్ క్వాలిఫై అయిన అభ్యర్థులను మెయిన్స్ కి అర్హత కల్పించాలని, ఈ బడ్జెట్ సమావేశంలో విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబేర్స్ మెంట్, స్కాలర్ షిప్ మొత్తం బకాయిలు చెల్లించాలని, ఖాళీగా ఉన్న అన్ని శాఖలను వెంటనే భర్తీ చేసి, నిరుద్యోగులకు నాలుగేండ్లుగా నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. వీటితోపాటు విద్యారంగ, నిరుద్యోగ సమస్యలన్నింటినీ పరిష్కరించాలనే డిమాండ్ తో ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే పోలీసులు ఆయనను ముందస్తు అరెస్టు చేసి ఎక్కడికి తీసుకెళ్లారో కనీసం సమాచారం కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టు చేసి 24 గంటలు గడుస్తున్న ఆయనను ఎక్కడ ఉంచారు పోలీస్ అధికారులు వెల్లడించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యారంగ సమస్యలపై శాంతియుతంగా పోరాటం చేస్తున్న నాయకుల పై ప్రభుత్వం కక్షగట్టి పోలీసులతో అక్రమంగా నిర్బంధించడం రాజ్యాంగ విరుద్ధమని అరెస్టు చేసి కనీసం ఆచూకీ కూడా చెప్పకపోవడం పౌరుల హక్కులకు భంగం కలిగించడమేనని ఆయన అన్నారు. విద్యారంగ అభివృద్ధి మరియు నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాక ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న నాయకులను అరెస్టు చేయడం ప్రభుత్వం యొక్క చేతగానితనానికి నిదర్శనమని, ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న వారి పట్ల తెలంగాణ ప్రభుత్వం పోలీసులు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా, రాజ్యాంగం తెలంగాణలో పనిచేస్తుందా అనే అనుమానం వ్యక్తమవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి తెలంగాణలో విద్యావ్యవస్థ సర్వనాశనం అయిందని, నిరుద్యోగుల జీవితాలు చీకటి అయ్యాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం పనిగట్టుకుని తెలంగాణలో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తుందని పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్య అనేది పేద,మధ్యతరగతి విద్యార్థులకు దూరం అవుతుందని, అలాగే రాష్ట్రంలో నిరుద్యోగం పెల్లుబికి ఆకలి కేకలు పెరుగుతాయని అలా కాకూడదనే ఉద్దేశంతోనే మా ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన అలుపెరగని పోరాటం చేస్తుందని అందుకోసమే ప్రభుత్వం కక్షగట్టి మరి వెంకట్ ని అక్రమ అరెస్టులకు పాల్పడి అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసి ప్రయత్నం చేస్తుందని, కానీ ప్రభుత్వం చేసే ఇలాంటి ఉడుత ఊపులకు, తాటాకు చప్పుళ్ళు కు బల్మూరి వెంకట్ గాని ఎన్.ఎస్.యు.ఐ నాయకులు గాని భయపడరని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
బేషరతుగా బలమూరి వెంకట్ తో పాటు అరెస్టు చేసిన మిగతా ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర నాయకులను పోలీస్ శాఖ వారు మీడియా ముందు ప్రవేశపెట్టి వారిని విడుదల చేయాలని లేని పక్షంలో రాష్ట్రంలోని విద్యార్థులందరూ కలిసి పెద్ద ఎత్తున ప్రగతి భవన్ ,మంత్రుల ఇల్లు ముట్టడి చేసి బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులను బయట తిరగకుండా చేస్తామని. అవసరమైతే ప్రగతి భవన్ ను కూడా ముట్టడిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ నాయకులు అష్రాఫ్, ఇంద్రసేన, సాయి, శివ, లక్కీ, శశి, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Feb,2023 07:22PM