నవతెలంగాణ కంటేశ్వర్
పోరాటాల ఫలితంగానే మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాల పెంపు అని సిఐడి జిల్లా కార్యదర్శినుజహాన్ మధ్యాహ్న భోజన పథకం జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి అన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జాను మధ్యాహ్న భోజన జిల్లా ప్రధాన కార్యదర్శి తోపునూరు చక్రపాణి మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచాలని సీఐటీయూ అనేక పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం 1000 నుండి 3 వేలకు పెంచిందని అన్నారు. శనివారం ప్రభుత్వము జీవో ను విడుదల చేయడాన్ని హర్షిస్తూ సిఐటియు ఆఫీసులో మిఠాయిలు పంచుకుంటూ టపాకాయలు పేలుస్తూ మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి మిఠాయిలు పంపిణీ చేసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతో అప్పులు తెచ్చి వంటలు చేసి పెడుతున్న మధ్యాహ్న భోజన కార్మికుల పోరాటాల ఫలితంగా గత సంవత్సరం అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి ప్రకటించి అమలు చేయలేదని అన్నారు. గత సంవత్సరము నుండి జీవో విడుదల చేసి అమలు చేయాలని సిఐటియు చేసిన పోరాటాల ఫలితంగా శనివారం జీవో విడుదల చేసిందని అన్నారు. జీవో విడుదల చేయడానన్నీ సిఐటియు హర్షిస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ జీవోను గత సంవత్సరం అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుండి అమలు చేస్తూ ఏరియర్స్ తో సహా చెల్లించాలని కోరారు. వేతనాల పెంపు జీవో కోసం పోరాటాలు చేసిన మధ్యాహ్న భోజన కార్మికుల అభినందన సభ జరుపుకున్నారు అదేవిధంగా 6,7,8 తేదీలలో మండల కేంద్రాల్లో విజయోత్సవ జరపాలని జిల్లా కమిటీ నిర్ణయించినది పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆఫీస్ బేరర్స్, జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షురాలు జక్కం సుజాత, సాయమ్మ నిరంజన, గంగాధర్ బాలరాజు, నాగలక్ష్మి తదితర మండలాల నుంచి వచ్చినటువంటి బాధ్యులు అందరు కూడా పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Feb,2023 07:29PM