- 16 మంది కూలీలకు గాయాలు
నవతెలంగాణ - తాడ్వాయి
ములుగు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆటో బోల్తాపడి ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు. 16 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. గోవిందరావుపేట మండలం ముద్దులగూడెం
గ్రామానికి చెందిన 18 మంది కూలీలు వరి నాట్లు పనుల నిమిత్తం శనివారం ఉదయం ఆటోలో మేడారానికి బయలుదేరారు. తాడ్వాయి మండలంలోని మేడారం సమీపానగల నార్లాపూర్ ఆరోగ్య ఉపకేంద్రం వద్దకు కు చేరుకోగానే టీఎస్ 28, టి 2286 కూలీలను తీసుకెళ్లే ఆటో అదుపు తప్పి ఒక్కసారిగా పల్టీకొట్టింది. దాంతో పల్లెబోయిన సునీత(30), భానోతు జ్యోతి(45) అనే మహిళ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. 16 మంది కూలీలు ఆటో డ్రైవర్ తో సహా తీవ్ర గాయాల పాలయ్యారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆటోలో పరిమితికి మించి వెళ్లడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 108 వాహనం లో పట్టకపోవడంతో, కొంతమంది క్షతగాత్రులను పోలీస్ వాహనంలో స్థానిక ఎస్సై వెంకటేశ్వరరావు, గతంలో ఎస్సైగా విధులు నిర్వహించి, ములుగు సిసిఎస్ సిఐగా విధులు నిర్వహిస్తున్న గద్ద రవీందర్ లు ఎంజీఎం కు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Feb,2023 07:35PM