- చింత క్రాంతి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు
నవతెలంగాణ-గోవిందరావుపేట
వనదేవతల ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్న హాత్ సే హాత్ జోడో యాత్రలో యూత్ సభ్యులు అధికంగా ఉండేలా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షులు చింత క్రాంతి పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలో మండల యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కు రణదీప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యూత్ ప్రత్యేక సమావేశంలో క్రాంతి మాట్లాడారు. మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల సాక్షిగా ఈనెల 6న సోమవారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్న హత్ సే హాత్ జోడో యాత్రకు మండల వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుండి యువతను అధికంగా కదిలించి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన చూడాలని అన్నారు. రేవంత్ రెడ్డి సారధ్యంలో యూత్ కాంగ్రెస్ అన్ని రంగాల్లో పార్టీనీ బలోపేతం చేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. రాబోయే రాష్ట్ర ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించేది యువత భుజస్కందాలపై ఉందని దీనిని నిరూపించి తీరుతామని అన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం యువత భవితవ్యాన్ని నిర్వీర్యం చేసిందని అన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగ సమస్యను నానాటికి పెంచుతూ యువతను మద్యానికి బానిస చేస్తూ మద్యం విక్రయాలతో ప్రభుత్వాన్ని నడుపుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ తోన యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉందని అఅన్నారు. యాత్రలో అన్ని విధాల యువత జయప్రదం చేసే బాధ్యతను తీసుకొని జయప్రదం చేయాలని మరోమారు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ నాయకులు యూత్ గ్రామ కమిటీ అధ్యక్షులు కొల్లు శ్రీనివాస్ రెడ్డి, వాసం శ్రావణ్, గొంది కిరణ్, రజినీకాంత్, రాకేష్ రెడ్డి, చెరుకుల సురేష్, వేణు తదితర నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Feb,2023 07:38PM