- ఏ.ఐ.పీ.కే.ఎం.ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోకినపల్లి ప్రభాకర్
నవతెలంగాణ - అశ్వారావుపేట
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీకి నిధులు తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం అశ్వారావుపేట ఎం.పీ.ఈ.వో కు వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా ఏ.ఐ.పీ.కే.ఎం.ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోకినపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించటాన్ని తీవ్రంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా పధకాలను ఎత్తివేసే కుట్రకు పూనుకుంటుందని విమర్శించారు.రూ.2.68 వేల కోట్లు అవసరం కాగా కేవలం 60 వేల కోట్లను విదిలించడం దుర్మార్గం అని అన్నారు. ఉపాధి హామీ నిధులు ఎక్కువ కేటాయించాలని,కార్మికులకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని,కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని,కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు ఎస్. ఏడుకొండలు,జట్టి లక్ష్ముడు,ఎం.నాగేశ్వరరావు, బేతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Feb,2023 07:42PM