నవతెలంగాణ-ఆర్మూర్
పట్టణంలోని మామిడిపల్లి యానం గుట్ట వద్ద గల ముజేగ మల్లన్న స్వామి జాతర ఆదివారం నిర్వహిస్తున్నట్టు స్థానిక కౌన్సిలర్లు ఆకుల రాము, కవిత కాశీరాం, మేడిదాల సంగీత రవి గౌడ్. వీడీసీ సభ్యులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంతో పాటు జక్రాంపల్లి మండలంలోని అర్గుల్, నారాయణపేట్, లక్ష్మాపూర్ ,బ్రాహ్మణపల్లి, తొర్లీకొండ, గాంధీనగర్, మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం ఈ జాతరలో పాల్గొంటారని వారు తెలిపారు.
గత 30 సంవత్సరాల నుండి విశ్వబ్రాహ్మణ వడ్రంగి మహిళలు రథానికి కట్టే అతిపెద్ద బంతిపూల తొట్లీలు తయారు చేయడం ఆనవాయితీగా వస్తుంది. శనివారం సాయంత్రం డప్పు వాయిద్యాలతో తోట్లేలను ఊరేగింపుగా తీసుకొని రథానికి కట్టి జాతర సంబరాలు మొదలు పెట్టినారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు సైతం చేస్తారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Feb,2023 08:23PM