- జిల్లా అధ్యక్షులు పవన్ కుమార్
నవతెలంగాణ - అశ్వారావుపేట
ప్రస్తుత కాలంలో విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడాలని అందుకోసం ఎస్ఎఫ్ఐ సంఘంలో చురుగ్గా చదువుతూ పోరాడుతూ విద్యార్థులకు వేగుచుక్క లా పని చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్ కుమార్ అన్నారు. శనివారం సంఘం ఆద్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో అనేక సమస్యలతో విద్యార్థులు నలిగి పోతున్నారని అన్నారు.
విద్యార్థులకు కావలసిన సదుపాయాలు లేక అనేకమంది విద్యార్థులు మధ్యలోని విద్యను ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 3568 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ విడుదల చేయాలని కోరారు. సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు కావలసిన మెస్స్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలని సూచించారు. ఉన్నత విద్యకు అధిక నిధులు కేటాయించాలని కోరారు.విదేశాల్లో చదువు కోవాలనుకుంటున్న విద్యార్థులకు మొత్తం ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నారు.రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్టల్ కు సొంత భవనాలు నిర్మించాలని అన్నారు.ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిర్మించాలని కోరారు.ప్రతి మండలంలో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఎం.ఈ.ఓ పోస్టులు భర్తీ చేయాలని కోరారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రభుత్వ జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా కమిటీ సభ్యులు వంశీ, అభి మిత్ర,మండల కార్యదర్శి అజీమ్ పాషా, మండల అధ్యక్షుడు నవీన్ కమిటీ సభ్యులు సంతోష్ , హేమంత్, సందీప్, జల్లి రమేష్, సత్య తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Feb,2023 08:31PM