- తుమ్మల వెంకటరెడ్డి సిపిఐ ఎం జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ-గోవిందరావుపేట
ఆటో ప్రమాదంలో మృతి చెందిన వ్యవసాయ కూలీల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని సిపిఐఎం పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని ముద్దులగూడెం గ్రామంలో మృతుల క్షతగాత్రుల కుటుంబాలను సిపిఐ ఎం బృందం పరామర్శించింది. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ ముద్దుల గూడెం గ్రామానికి చెందిన కూలీలు నార్లపురం నాటుకు వెళుతూ నార్లాపూర్ గ్రామంలో ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో నాటుకు వెళ్తూ ఆటో లో ప్రయాణిస్తున్న ఎల్లబోయిన సునీత 30 సంవత్సరాలు బానోత్ జ్యోతి 26 సంవత్సరాలు ఇద్దరు మృతి చెందడం, ఇంకా ఐదుగురు తీవ్రంగా గాయపడడం జరిగింది.
ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరణించిన కవిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ప్రభుత్వం మరణించిన కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వాలని వారి పిల్లలకు ప్రభుత్వమే ఉచితంగా చదువు చెప్పించాలని తీవ్రంగా గాయపడిన కుటుంబాలకు ప్రభుత్వమే బాధ్యత వహించి వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి తీగల ఆదిరెడ్డి, పొదిళ్ల చిట్టిబాబు, బొచ్చు సంజీవ, మారబోయిన సారయ్య, మాడ నరసయ్య, ఎక్స్ సర్పంచ్ జిమ్మ వరలక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Feb,2023 09:02PM