- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-చివ్వేంల
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత వైద్యం కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తామని
మాట ఇచ్చి మాట తప్పిన ప్రభుత్వమని రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ మండల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందనన్నారు.
రైతు రుణమాఫీ నిరుద్యోగ భృతి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తామని ఎన్నికలలో హామీ యిచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీని ప్రజలు బ్రహ్మరథం పట్టి అధికారంలోకి తీసుకొస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు లక్ష్మణరావు, ధరావత్ శ్రీనివాస్ నాయక్,కొనతం అప్పిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు జంపాల వెంకటేశ్వర్లు ,బిట్టు నాగరాజు, వీరస్వామి, రాజశేఖర్ , అనిల్, వీరన్న నాయక్, అశోక్, జాని పాషా, పఠాన్ పాషా, చిట్టి బాబు, కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Feb,2023 02:55PM