నవతెలంగాణ - మద్నూర్
పంట పండించడానికి రైతన్న ఎన్ని కష్టాలు పడ్డా చివరకు పెట్టిన పెట్టుబడి రాక ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది రబ్బి పంట సాగులో భాగంగా మద్నూర్ మండలంలో అత్యధికంగా శనగ పంట సాగు చేశారు. ఈ పంటకు పెట్టుబడి ఎక్కువ దిగుబడి తక్కువగా రావడమే కాకుండా రైతన్నకు శనగ పంటకు మద్దతు ధర కరువైంది. ప్రయివేటు కొనుగోలు వ్యాపారులు మోచర్ పేరుతో శనగ పంటకు ధర మద్దతు ధర కంటే ఏడు వందల రూపాయలు తక్కువగా కొనుగోలు చేస్తున్నారంటూ శనగ పంట రైతులు మోచర్ కోసం పండించిన పంటకు ఎండలో ఆరబెడుతున్నారు.
గత వారం రోజులుగా చలి పెరిగింది దినమంత ఎండలో ఆరపెట్టిన రాత్రి చలికి శనగ పంట నమ్ము ఎక్కి మోచర్ పెరుగుతుంది. ఈ విధంగా రైతన్న ఆరుగాలాలపాటు రాత్రి పగలు ఎండ వాన అన్నింటికి ఓర్చుకొని పంట పండిస్తే దిగుబడి కోసం పెట్టుబడులు విపరీతంగా పెట్టినప్పటికీ శనగ పంట దిగుబడి భారీగా తగ్గిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరానికి దిగుబడి ఎనిమిది క్వింటాల నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా ఐదు క్వింటాల నుంచి 6 క్వింటాళ్ల వరకే దిగుబడి రావడంతో శనగ పంట రైతులు దిగులు చెందుతున్నారు. సర్కారు మద్దతు ధర 5350 ఉండగా సర్కారు మద్దతు ధర కొనుగోలు లేకపోవడంతో ప్రయివేటు వ్యాపారులు మోచర్ పేరుతో మోసాలకు పాల్పడుతూ సెనగ పంట క్వింటాలుకు 46 వందల నుండి 47 వందల వరకు కొనుగోలు చేయడంతో ధరతో పాటు ఆడద్ హమాలి పేరుతో భారీగా మోసాలు జరుగుతున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ సర్కార్ ప్రతి పంటకు మద్దతు ధర కల్పిస్తున్నామని అన్ని రకాల పంటలు మద్దతు ధరతో కొనుగోలు చేపడుతున్నామని ఒకపక్క గొప్పలు చెప్పుకుంటూ వస్తోంది కానీ పంట దిగుబడులు చేతికి రాగానే మద్దతు ధర కేంద్రాలు ప్రారంభించకపోవడం పండించిన పంటను రైతన్నలు మద్దతు ధర కొనుగోలు లేక ప్రయివేటు అమ్మకాలకే ముగ్గు చూపవలసిన దుస్థితి ఏర్పడింది. రైతన్నకు జరిగే మోసాల పట్ల మద్దతు ధర కరువు పట్ల అధికారులు గానీ ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకోకపోవడంతో వ్యవసాయ రైతులు మోసపోవలసిన దుస్థితి ఏర్పడింది. ఒకపక్క భారీగా పెట్టుబడులు పెట్టి పంటను పండిస్తే కాలం కలిసి రాక దిగుబడులు రాకపోవడం రైతన్న దిగులు చెందుతున్నారు. వచ్చిన దిగుబడికి మద్దతు ధర కరువైంది.
శనగ పంట రైతులు మద్దతు ధర కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో క్వింటాలుకు 650 రూపాయలు మోసపోతున్నారు. హడత్ హమాలి కలుపుకుంటే 700 నుండి 800 రూపాయలు ప్రతి క్వింటాలుకు శనగ పంట రైతన్న మోసపోవల్సిన దుస్థితి కొనసాగుతుంది పంట దిగుబడుల కోసం రైతన్న ఎన్ని రకాల కష్టాలు పడ్డా కాలం కలిసి రాకపోవడంతో ఈ ఏడాది దిగుబడి ఎకరానికి రెండు నుంచి నాలుగు క్వింటాళ్ల వరకు తగ్గిపోయింది. ప్రభుత్వం వెంటనే శనగ పంట మద్దతు ధర కేంద్రాలు ప్రారంభించి రైతన్నలకు ఆదుకోవాలని మండల వ్యవసాయ రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Feb,2023 03:05PM