నవతెలంగాణ- తాడ్వాయి
నేడు మేడారంలో వనదేవతల దర్శనం అనంతరం, పస్రాలో భారీ బహిరంగ సభ విజయవంతం, అనంతరం పాదయాత్ర విజయవంతం చేయాలని తాడ్వాయి మండల అధ్యక్షుడు జాలపు అనంతరెడ్డి, మాజీ జెడ్పిటిసి బొల్లు విజయ దేవేందర్, పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క, తాడ్వాయి మండల కమిటీ ఫ్లెక్సీలు ఆటోలకు పెట్టుకొని, వాల్ పోస్టర్లు అతికించి, విస్తృత ప్రచారం నిర్వహించారు. మండలంలోని 18 గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇల్లు, ఇల్లు తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిపిసిసి అధ్యక్షుడు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న హాత్ సే హాత్ జూడో యాత్ర రేపు(సోమవారం) మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధానం నుంచి ప్రారంభిస్తారని, 11 గంటలకు వనదేవతలను రేవంత్ రెడ్డి దర్శించుకుంటారని, మండలంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మేధావులు, మీడియా మిత్రులు, మహిళలు, శ్రామికులు, కార్మికులు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ ఒకటేసారి జరుగుతుందని, ధరణిని రద్దు చేస్తామని, రైతులకు, విద్యార్థులకు, మేధావులకు, ఉద్యోగస్తులకు రైతు కూలీలకు, శ్రామికులకు, కార్మికులకు, కర్షకులకు సబ్బండ వర్గాలకు అందరికీ సమన్యాయం జరుగుతుందని వారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారమే ధ్యేయంగా సీతక్క ఆదేశాల మేరకు కృషి చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Feb,2023 08:20PM