నవ తెలంగాణ - ఆర్మూర్
పీఎంపీల సమస్యల సాధన కోసం ఎప్పుడు ముందుంటామని పీఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పుల్కన్ మోహన్ అన్నారు. ఆదివారం పట్టణంలోని టీచర్స్ కాలనీలోనీ పీఎంపీ భవనంలో మండల పీఎంపీ అసోసియేషన్ నూతన కార్యవర్గం జిల్లా అధ్యక్షులు మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సాయిలు, ఉపాధ్యక్షులు రంజిత్, కార్యదర్శి శ్రీనివాస్, ట్రెజరర్ గా నరేందర్, జాయింట్ సెక్రెటరీగా నరేందర్, సంయుక్త కార్యదర్శిగా తిరుపతి, సలహాదారుడుగా హరిచరణ్ లను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు పీఎంపీలు మరియు జిల్లా అధ్యక్షులు వారిని ఘనంగా సన్మానించి శుభాభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిఎంపి అసోసియేషన్ అభివృద్ధి కోసం తాము ఎప్పుడు ముందుంటామని ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి శయ శక్తుల ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పీఎంపీలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Feb,2023 08:41PM