- ఆసక్తి గల వారు పాల్గొనడం కోసం
నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో పోలీస్ ఎ.ఆర్ (ఎమ్.టి) విభాగంలలో వినియోగం అనంతరం వాటిని ప్రస్తుతం వాటి కాల సమయం పూర్తి అయినటువంటి అన్ని సామాగ్రీలను, ఈ దిగువ విధంగా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు తేది: 09-02-2023 నాడు ఉదయం 10:30 గంటలకు వేలం పాట వేయడం జరుగుతుంది.
కావున ఆసక్తి గల వారు ఈ వేలం పాట యందు పాల్గొని అట్టి ఎ.ఆర్ (ఎమ్.టి ) సెక్షన్ విడిభాగాలను తమ స్వంతం చేసుకొనగలరు అని మనవి. వేలం పాట యందు ఈ దిగువ తెలియజేసినవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాహనాలకు వాడి తీసివేసిన టైర్స్, ట్యూబ్స్, బ్యాటరీలు, ఇంజన్ ఆయిల్ మరియు మొదలగునవి గలవు.ఆసక్తి గల వారు ఈ వేలం పాట యందు పాల్గొనగలరు అని తెలిపారు.