నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జంగంపల్లి గ్రామానికి చెందిన ప్రణయ్ కుమార్ (31) గత మూడు సంవత్సరాల క్రితం పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లి అక్కడ కంపెనీ మూసివేయడంతో ఇండియాకు తిరిగి వచ్చి, దాబా హోటల్లో కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత కొద్ది రోజుల నుండి దుబాయ్ వెళ్లడానికి చేసిన అప్పులు తీర్చడానికి తీవ్ర మనస్థాపం చెంది, జీవితంపై విరక్తి చెంది గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్ద వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
దాబా హోటల్ కు పనికి వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల బంధువుల వద్ద ఎంత వెతికిన ఆచూకీ లభించ లేదు. గ్రామ శివారులో వ్యవసాయ బావి వద్ద వేప చెట్టుకు ఉరివేసుకొని ప్రణయ్ కుమార్ మరణించినట్లు తెలియడంతో కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆనంద్ గౌడ్ తెలిపారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 06 Feb,2023 08:56PM