నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన దాసరి అరవింద్ ఆరు నెలల క్రితం పాముకాటుకు గురవ్వగా, ఆస్పత్రిలో చేరి ఆర్థికంగా ఇబ్బందులకు గురికాగా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో ముఖ్యమంత్రి సహాయనిది కింద మంజూరైన 52 వేల రూపాయల చెక్కును సోమవారం భారతీయ జనతా పార్టీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు రెడ్డిగారి రమేష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, యాదగిరి గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు బసవ రెడ్డి, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm