- ఏఐవైఎఫ్ మండలాధ్యక్షుడు దొంతరవేణీ మహేశ్
నవతెలంగాణ-బెజ్జంకి
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీతో యువతకు నిరాశ్రాయులను చేసిందని ఏఐవైఎఫ్ మండలాధ్యక్షుడు దొంతరవేణీ మహేశ్ అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో బడ్జెట్ పై మహేశ్ మాట్లాడుతూ యువతకు ఇచ్చిన హామీలను విస్మరించిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించకపోవడం యువతపై కపటప్రేమను వల్లించడమేనన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచిందన్నారు. సీపీఐ నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm