- అర్థశాస్త్ర విభాగం చైర్మన్ ,బోర్డ్ ఆఫ్ స్టడీస్ ,డాక్టర్ ఏ పున్నయ్య
నవతెలంగాణ-డిచ్ పల్లి
బడ్జెట్ అంకెల్లో కాకుండా ప్రజల ఆకాంక్షలను తట్టినప్పుడే బడ్జెట్ ప్రక్రియ సార్ధకం అవుతుందని అర్థశాస్త్ర విభాగం చైర్మన్ ,బోర్డ్ ఆఫ్ స్టడీస్, డాక్టర్ ఏ పున్నయ్య అన్నారు. అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన పోస్టు బడ్జెట్ సింపోజియం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అయన పాల్గొని మాట్లాడారు. నైసర్గికంగా ప్రాంతాల మధ్యన విపరీతమైన వ్యత్యాసాలు ఉన్నాయని, ఈ వ్యత్యాసాలను అభిలష నియమైనా బడ్జెట్ కేటాయింపులతో పూర్తి చేయాలన్నారు.
బడ్జెట్ ప్రక్రియ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కీలకంగా ప్రభావం చూపుతుందని పున్నయ్య పేర్కొన్నారు. ఈ బడ్జెట్ కేటాయింపులు సమతుల్య స్థితిలో కేటాయించాలని, ఈ సింపోజిషన్ లో అర్థశాస్త్ర విద్యార్థులు బడ్జెట్లో వృద్ధి, అభివృద్ధి, ప్రాథమిక లోటు, రెవెన్యూ లోటు, లాంటి సాంకేతిక పదాల భావాలను అర్థం చేసుకున్నారు. ఉత్తమ బడ్జెట్ను ఎలా రూపొందించుకోవాలో విద్యార్థులు తమ తమ అభిప్రాయాలను తెలిపారు. గంభీరమైన పదాల కూర్పు కాకుండా ఆచరణ సాధ్యమైన కేటాయింపులు ఉండాలని వారు అభిప్రాయపడ్డారు. ఈ సింపోసియంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పాత నాగరాజు, డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ స్వప్న, డాక్టర్ రామలింగం, డాక్టర్ నర్సయ్య, డాక్టర్ దత్త హరి, డాక్టర్ ప్రవీణ్ తో పాటు పరిశోధక విద్యార్థులు పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 07 Feb,2023 05:16PM