నవతెలంగాణ-కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో నేతన్నల సంక్షేమానికి ఒక్క రూపాయి కేటాయించకపోవడం బాధాకరమని
జాతీయ చేనేత ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ కోశాధికారి సిలివేరి గణేష్ మంగళవారం
నిజామాబాదులో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నేతన్నలు ఎంతో అభివృద్ధి పథంలో నడుస్తున్నారని, నే తన్నల మనసును దోచాలని చూశారు. తప్ప నిధులు కేటాయించకపోవడం శోచనీయమని అన్నారు. నేతన్నలు అంత తెలివి తక్కువ వారు ఏమి కాదని బడ్జెట్ ను నేతన్నలు అర్థం చేసుకోకుండా ఉంటారని ప్రభుత్వం భ్రమ పడటం తప్పు అని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేనేత రంగానికి చేయూతనిచ్చి కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .
Mon Jan 19, 2015 06:51 pm