- పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కలెక్టర్
నవతెలంగాణ-డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలం రాంపూర్ డి గ్రామంలో అన్ని హంగులతో ఒక కోటి రూపాయల నిధులను వెచ్చిస్తూ నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వృద్ధాశ్రమం భవనానికి మంగళవారం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, శాసన మండలి సభ్యులు వి.గంగాధర్ గౌడ్ లతో కలిసి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రారంభోత్సవం చేశారు. వృద్ధాశ్రమం ఆవరణలో ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు.వృద్ధాశ్రమంలోని వివిధ విభాగాలను సందర్శించి సదుపాయాలను పరిశీలించారు.
స్థానికంగా ఏర్పాటు చేసిన ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరి వెంట జెడ్పిటీసి బాజిరెడ్డి జగన్, దాసరి ఇందిరా లక్ష్మి నర్సయ్య,ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబరి మోహన్, సర్పంచ్ పాపాయి తిరుపతి, ఉప సర్పంచ్ యెంకనోల్ల రమేష్, డీడబ్ల్యుఓ సుధారాణి,రోలు సత్యనారాయణ, తేలు గణేష్, నడ్పన్న, తహసీల్దార్ శ్రీనివాస్ రావు, సోసైటి చైర్మన్ తరచంద్ నాయక్, పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, శక్కరి కోండ కృష్ణ,మోహమ్మద్ యూసుఫ్, మోహన్ రెడ్డి, ఎంపిటిసి సుజాత రవి, సాయిలు,బిఅర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అదికారులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
శిబిరాలకు వచ్చే వారికి మెరుగైన సేవలందించాలి.. కంటి వెలుగు శిబిరాలను సందర్శించిన కలెక్టర్
దృష్టి లోపాలను నివారించాలని కృత నిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం సందర్శించారు. డిచ్ పల్లి మండలంలోని ధర్మారం బీ, గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన శిబిరంతో పాటు, యానాంపల్లి తండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. శిబిరాల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. నేత్ర పరీక్షలు చేయించుకునేందుకు ప్రతి రోజు ఎంత మంది వస్తున్నారు, కంటి అద్దాలు, మందులు సరిపడా స్టాక్ అందుబాటులో ఉందా అని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. శిబిరాల వద్ద అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. శిబిరాలకు వచ్చే వారికి మెరుగైన సేవలందించాలని ఆదేశించారు. పక్కనే గల నర్సరీలో మొక్కలు పెంచేందుకు చేసిన ఏర్పాట్లను గమనించిన కలెక్టర్, ఎంపిడిఓ గోపి బాబు కు పలు సూచనలు చేశారు. మొక్కలు నాటే సమయానికి తగిన ఎత్తుతో కూడిన వివిధ రకాల మొక్కలు అందుబాటులో ఉండేలా సరైన ప్రణాళికతో నర్సరీల్లో మొక్కలు పెంచేలా పర్యవేక్షణ ఎప్పటికప్పుడు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్లు పత్తి మమత ఆనంద్, లాంబని నిలా ఎంపిడిఓ గోపి బాబు తోపాటు తదితరులు పాల్గొన్నారు.
మన ఊరు - మన బడి పనులు తనిఖీ
డిచ్ పల్లి మండలంలోని రాజారామ్ నగర్ లో గల మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు -మన బడి కింద చేపట్టిన పనులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం తనిఖీ చేశారు. తుది దిశగా మిగిలి ఉన్న పనులను కూడా నాణ్యతతో చేపడుతూ త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పాఠశాల ఆవరణను చక్కగా చదును చేసి పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. పాఠశాలలో ఎన్ని తరగతులు కొనసాగుతున్నాయని, విద్యార్థుల సంఖ్య, ఎంత మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారని,
వివిధ పనుల కోసం మంజూరైన నిధులు తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డీ ఎం హెచ్ ఓ డాక్టర్ సుదర్శనం, గోవర్ధన్, ఎంపీడీఓ గోపి బాబు, తహసీల్దార్ శ్రీనివాస్ రావు,ఎంఈఓ శాఖల అధికారులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 07 Feb,2023 06:56PM