- గ్రంధాలయ చైర్మన్ గోవింద నాయక్
నవతెలంగాణ- తాడ్వాయి
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, గ్రంథాలయ శాఖ చైర్మన్ పోరిక గోవింద నాయక్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోవింద నాయక్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి పాదయాత్రల కాకపోతే మోకాళ్ల యాత్ర చేసుకోవాలని సూచించారు.
కానీ సీఎం కేసీఆర్ ను తిడితే మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. గిల్లికజ్జాలు పెట్టుకోవాలని చూసే కాంగ్రెస్ నాయకులు పద్ధతి మార్చుకోవాలని గోవింద నాయక్ హితవు పలికారు. గాలిమాటలు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించిన ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు పద్ధతి మార్చుకోకుంటే ప్రజలే తరిమికొడతారని అన్నారు.
ములుగు జిల్లా కార్వాన్ మండలం మేడారం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఎవరి కోసం చేస్తున్నారు ? ఎందుకోసం చేస్తున్నారు ? దేనికోసం చేస్తున్నారో ? ములుగు జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో సమానంగా ములుగు జిల్లా ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ములుగు జిల్లా ఆదివాసి గిరిజనులు ఉండే మారుమూల ఏజెన్సీ జిల్లా కాబట్టి, మిగతా జిల్లాల కంటే అధిక ప్రాధాన్యత ఇచ్చి, ములుగు జిల్లా ను సస్యశ్యామలంగా, అగ్రగామి ఉండే విధంగా నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. గిరిజన యూనివర్సిటీ కోసం టిఆర్ఎస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పడుతున్న, రేవంత్ రెడ్డి ఎంపీఐ ఉండి కూడా ఒకసారి కూడా పార్లమెంట్లో ఈ సమస్యను లేవనెత్తిన పాపాన పోలేదని మండిపడ్డారు. ఆశ ఖండంలో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని ఏ ఒక్కరోజు కూడా పార్లమెంటులో ప్రస్తావించలేదని ధ్వజమెత్తారు.
ములుగు జిల్లాలో వైద్య పరంగా అగ్రముగామిగా నిలిపారని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ పాదయాత్రను భద్రాచలం నుండి ప్రారంభిస్తామని మొదటగా చెప్పి ఇప్పుడు ఇక్కడి నుండి ప్రారంభిస్తున్నారు ఇందులో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ములుగు జిల్లా ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోయే కాలంలో మీకు మీ పార్టీకి తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో రైతుబంధు అధ్యక్షులు పళ్ళ బుచ్చయ్య, మేడారం ఉత్సవ కమిటీ మాజీ అధ్యక్షులు కొర్రెబెల్లి శివయ్య, బంధాల సర్పంచ్ ఊకే మోహన్ రావు, టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు చల్ల రజనీకర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు బండారి చంద్రయ్య, పిఎసిఎస్ డైరెక్టర్ లింగ చారి, నాయకులు ఆలేటి ఇంద్రారెడ్డి, నాగమ్మ, జైపాల్ రెడ్డి, శేషగిరి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 07 Feb,2023 07:03PM