- సమస్యలతో సతమతం అంటూ ఎస్.సి,బి.సి లు
నవతెలంగాణ - అశ్వారావుపేట
మండలంలోని గుర్రాల చెరువు దళిత,యాదవ మహిళలు మంగళవారం అశ్వారావుపేట వచ్చిన జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల అభివృద్ధి అధికారి సంజీవరావు తన మొర వినిపించారు.
ఈ మహిళలు వారి సమస్యలు పై సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ అనుదీప్ కు వినతి పత్రం అందించిన విషయం పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో కలెక్టర్ అనుదీప్ ఆదేశాలు మేరకు డి.ఎం.డబ్ల్య.ఓ తహశీల్దార్ కార్యాలయానికి వచ్చారు.
ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన హెచ్.ఎం టి.వి అశ్వారావుపేట ప్రతినిధి సంకురాత్రి సతీష్ నేతృత్వంలో మహిళలు తమ సమస్యలు ఎవ్వరూ పట్టించుకోవడంలేదని తహశీల్దార్ కార్యాలయం సాక్షి గా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరావు కలెక్టర్ అనుదీప్ ఆదేశాలు మేరకు ఇక్కడకు వచ్చానని, మరో వారం రోజుల్లో గుర్రాల చెరువు పరిధిలో ప్రభుత్వ భూములు గుర్తించి,సేకరించిన అనంతరం అర్హులైన వారికి ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రేషన్ దుకాణం వెంటనే ఏర్పాటు చేయడానికి రెవిన్యూ శాఖ కు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
అనంతరం స్థానిక ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ మూర్తిని కలిసి వినతి పత్రం అందజేసారు. గత సంవత్సర కాలం గా ఉపాధి హామీ పథకంలో పని చేసిన కూలీలకు వేతనం రావడం లేదని పిర్యాదు చేసారు. ఆయన దీని పై పూర్తి విచారణ చేసి ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకొని బాధ్యులు పై చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు.గ్రామంలో ప్రధాన రహదారి ప్రక్కన డ్రైన్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అంతర్గత రోడ్లు, మారుతి నగర్ లో ఒక రోడ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంతమ్మ, పుష్ప, సునీతా, సంధ్య, లక్ష్మీ, స్థానికులు కలపాల శ్రీను, యారా నాగేశ్వరావు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 07 Feb,2023 07:09PM