నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని స్థానిక బి టి ఎస్ వద్ద 44వ జాతీయ రహదారి పై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి నుండి ప్రయాణికులతో భిక్కనూర్ వస్తున్న ఆటో బి టి ఎస్ వద్దకు చెరుకొగానె ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్నా ఆటో డ్రైవర్, ప్రయాణికులు 8 మందికి గాయాలయ్యాయి. వెంటనే 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించగా, గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm