నవతెలంగాణ-కోహెడ
మండల కేంద్రంతో పాటు మండలంలోని బస్వాపూర్, తంగళ్ళపల్లి గ్రామాలకు ఆరోగ్య ఉప కేంద్రాల నూతన భవనాల మంజూరుకు కృషి చేసిన మంత్రి హరీష్‌రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌లకు ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ మండల ప్రజల ఇబ్బందులను దృష్టిలోకి తీసుకొని ఆరోగ్య ఉపకేంద్రాలకు నూతన భవనాలను మంజూరి చేశారన్నారు. అలాగే ముఖ్యమంత్రి కెసీఆర్ విద్య, వైద్యం, రైతుల శ్రేయస్సుకు ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టారన్నారు. రానున్న రోజులలో మండలానికి మరిన్ని సంక్షేమ పథకాలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని ఆమె ఆకాంక్షించారు.
Mon Jan 19, 2015 06:51 pm