- ఇదిగో మేము చేసిన అభివృద్ధి
- నయా పైసా ఇవ్వకుండ మాట్లాడటం హేయం
- రాంపూర్ గ్రామానికి ₹ 7 కోట్ల 56 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు
నవతెలంగాణ-డిచ్ పల్లి
గ్రామాల అభివృద్ధికి ఒక్క రూపాయి ఇవ్వకుండా, ఎలాంటి పనులు చేయకుండా గ్రామాలకు వచ్చే వారిని నిలాదియలని, ప్రజలు, యువత అలాంటి మోసగాళ్ల ఉచ్చులో పడోద్దని,ఒక్క గ్రామంలో 7కోట్ల 56లక్షల రూపాయలు మంజూరు చేసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన లు చేశామని, ఇదిగో మేము చేసిన అభివృద్ధి మీ కంటికి కనపడదా అని,మీరు ఎప్పుడైనా గ్రామాలకు నయా పైసా ఇవ్వకుండ మాట్లాడటం హేయమని ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
మంగళవారం డిచ్ పల్లి మండలంలోని రాంపూర్ డీగ్రామంలో మొత్తం ₹ 7 కోట్ల 56 లక్షల రూపాయలతో నిర్మించిన చెక్ డ్యాం, పశు మెటాలిటీ హాస్పిటల్, వృద్ధాశ్రమం భవనం, పశువైద్యశాల భవనం, శ్మశానవాటిక, అంగన్‌వాడీ భవనాలు, కమ్యూనిటీ హాలు భవనాలు, సిసి రోడ్, డ్రైనేజ్, కుల సంఘ భవనాలు, సహకార సొసైటీ లో వ్యాపార దుకాణాల సముదాయము, పాఠశాల ల్లో ₹7 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ తో కలిసి మంగళవారం ప్రారంభించారు.
ఉదయం నుంచి రాత్రి వరకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన లు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రాంపూర్ గ్రామంలో 7 కోట్ల 56 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం ఎనలేని ఆనందాన్ని కలిగిందన్నారు. సీఎం కేసీఆర్ దేశ ప్రజలు ప్రధాని కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అరోజులు కూడా దేగ్గరలోనే ఉన్నాయన్నారు. దేశ్ కనేత సీఎం కేసీఆర్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందజేస్తూ దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ ఫలాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు.కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం అప్పుల మయంగా మార్చిందే తప్ప ఏ ఒక్క గ్రామానికి అయినా రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. జిల్లాకు చేందిన ఎంపి సంవత్సరానికి 5 కోట్లా రూపాయలు ఎం.పి ఫండ్ ఉంటుందని, ఒక గ్రామానికి రూపాయి ఇచ్చింది లేదన్నారు .కానీ పొద్దున లేస్తే సోషల్ మీడియాలో, ప్రెస్ మీట్ లు పెట్టడం కేసీఆర్ ని తిట్టడం వారి కుటుంబాన్ని తిట్టడం తప్ప ప్రజలకు చేసింది మాత్రం గుండు సున్నా అన్నారు. దేశ ప్రధాని దేశ సంపదలను అధని, అంబానికి, ప్రభుత్వ సంస్థలు అమ్ముతూ దేశాన్ని మొత్తం అప్పుల మయంగా మారుస్తూ దేశాన్ని ఆర్థికంగా వెనుకకు నెట్టిన ఘనత ప్రధాని మోడీ కి చెందుతుందని బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు.
అనంతరం పలు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.అంతకు ముందు ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ పుట్టిన గ్రామానికి ఎంత చేసిన తక్కువేనని, గ్రామంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలనే కోరిక ఉందన్నారు.ఇదే కాకుండా రహదారుల నిర్మాణం కు కోట్లా రూపాయలు నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఒలంపిక్ సంఘం ఉపాధ్యక్షులు, జడ్పిటిసి, జిల్లా యువ నాయకులు బాజిరెడ్డి జగన్మోహన్, ఉమ్మడి జిల్లాల డిసిఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జడ్పిటిసి దాసరి ఇందిరా లక్ష్మీ నర్సయ్య, పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు మోహన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ తారాచంద్ నాయక్, సర్పంచ్ పాపాయి తిరుపతి, తెలు గణేష్, నడ్పన్న, లోలం సత్యనారాయణ, ఉప సర్పంచ్ యెంకనోల్ల రమేష్, ఎంపిటిసి సుజాత రవి, సాయిలు, సిఈఓ నాగరాజ్,విడిసి చైర్మన్ రాజ్ కుమార్, సినియర్ నాయకులు శక్కరి కోండ కృష్ణ, మోహమ్మద్ యూసుఫ్, సాకలి సాయిలు,రఘునథన్ రాము,
ఎంపిఓ రాం కిషన్ రావు, జెడిఎ బలిక్ అహ్మద్, మండల పశువైద్య దొరికాయి గోపి కృష్ణ, ఎఓ రాంబాబు, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఉపసర్పంచులు ఎంపిటిసిలు, యువజన సంఘాల నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 07 Feb,2023 07:18PM