నవతెలంగాణ - అశ్వారావుపేట
మేజర్ పంచాయితీ అశ్వారావుపేట సాధారణ సర్వసభ్య సమావేశం మంగళవారం సర్పంచ్ రమ్య అధ్యక్షతన నిర్వహించారు. ప్రస్తుతం నిల్వ నిధులతో పంచాయితీ బకాయి లు చెల్లించాలని,పంచాయితీ పరిధిలో ప్రస్తుతం మూడు స్మశాన వాటికలు కు అదనంగా మరో వాటిక కు ప్రభుత్వం స్థలం కేటాయించాలని తీర్మాణం చేసారు.అంతే గాకుండా ఆక్రమణకు గురైన పంచాయితీ అంతర్గత వీధులను స్వాధీనం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఈ.ఓ హరిక్రిష్ణ, ఉపసర్పంచ్ కేదార్ నాధ్ పాలకవర్గం సభ్యులు యు.ఎస్ ప్రకాశ్, లక్ష్మణ్ రావు లు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm