- బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈవిల్ నారాయణ
నవతెలంగాణ కంటేశ్వర్
గుర్తింపు సంఘాలతో మూడోవేదన సవరణ ఒప్పందం మీద మేనేజ్మెంట్ సంతకం చేసి వెంటనే వేతన సవరణ అమలు చేయాలని బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈవిల్ నారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం సమయంలో సంచర్ భవనము ఎదుట ధర్నా నిర్వహించారు. నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల కోసం కొత్త ప్రమోషన్ పాలసీ మీద గుర్తింపు సంఘాలు చేసిన ప్రతిపాదనలను ఆమోదించి వెంటనే క్రొత్త ప్రమోషన్ పాలసీని అమలు చేయాలి. ఏ రకమైన అడ్డంకులు లేకుండా BSNL 4G & 5G సర్వీసులను వెంటనే ప్రారంభించాలి.ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు అనగా 07-02-2023న లంచ్ అవర్ లో భారీగా ప్రదర్శనలు జాయింట్ ఫోరమ్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్స్ అథ్వర్యం లో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు భారీగా పాల్గొని విజయంతం చేసారు. ఈ ధర్నా కార్యక్రమం లో రిటైర్ /విఆర్ఎస్ ఉద్యోగులు బిఎస్ఎన్ఎల్ ఈ యు నాయకులు మస్తాన్ అలీ, సాయిలు కేశవరావు అనురాధ కృష్ణ గంగాధర్ అక్బర్ రెహమాన్ రమేష్ సాయిలు తదితరులు అధికసంక్యలో పాల్గొన్నారు.