-మరమ్మత్తులకు గురైన విద్యుత్ మోటార్...
- బాలికల గురుకుల పాఠశాలకు నీటి ఎద్దడి...
నవతెలంగాణ - అశ్వారావుపేట
నలుగురు ఉన్న ఇంట్లోనే నీటి ఎద్దడి వస్తే ఇబ్బందులు ఎన్నో మన అందరికీ స్వీయ అనుభవమే.అదే నాలుగు వందలు పైగా ఆడ పిల్లలు ఉండే వసతి గృహం లో ఒక రోజు మొత్తం నీటి సౌకర్యం లేకపోతే వారి బాధలు ఎంతని చెప్పగలం.. అద్దె భవనంలో నడుస్తున్న స్థానిక మహాత్మా జ్యోతీ రావు ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ గురుకుల బాలికల వసతి గృహంలో మంగళవారం విద్యుత్ మోటార్ మరమ్మత్తులకు గురైంది.420 మంది విద్యార్ధినులు ఉన్న ఈ వసతి గృహంలో నీటి ఎద్దడి నివారణకు ప్రిన్సిపాల్ తాత్కాలిక చర్యలు తీసుకున్నారు.రెండు ట్యాంకర్ లతో నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ అవి ఎంత మేర ఉపయోగపడతాయో మనందరికీ తెలిసిందే.పైగా ఆ నీటిని ఎవరికి వారు బకెట్ ల తో వారి గదుల్లోకి చేర్చడం తలకుమించిన భారమే అని చెప్పుకోవాలి.గ్రౌండ్ ఫ్లోర్ విద్యార్ధులకు అయితే కాస్తా ఉపశమనం అనే చెప్పుకోవాలి.రెండో అంతస్తుకు నీటిని తీసుకువెళ్ళడం బాధాకరమే. అయితే భవనం యజమాని బోర్ మరమ్మత్తులకు నిరాకరించడంతో ప్రిన్సిపాల్ స్వప్న గురుకుల అధికారులకు నివేదిక పంపారు.
త్వరగా మరమ్మత్తులు పూర్తి చేసి నీటి సరఫరా చేయాలని విద్యార్థినిలు,తల్లిదండ్రులు కోరుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 07 Feb,2023 07:58PM