నవతెలంగాణ- తాడ్వాయి
మండలంలోని కాటాపూర్ రామాలయ ఆలయ కమిటీ అధ్యక్షులుగా దిడ్డి మోహన్ రావు ఎన్నికయ్యారు. మంగళవారం స్థానిక సర్పంచ్ పుల్లూరి గౌరమ్మ ఆధ్వర్యంలో కమిటీ మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కుసుమ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా గండు నరేష్, ముండ్రాతి రమేష్,
సలహాదారులు మద్దూరి రాములు, ముత్తినేని లక్ష్మయ్య, ఇందారం లాలయ్య, మేడిశెట్టి నరసింహయ్య,
కోశాధికారి గా గడ్డం రాజ్ కుమార్, తడక హరీష్, సహాయ కార్యదర్శులు గా మల్లికార్జున చారి, గంగెల్లి విజయ్, కాయితీ శ్రీను, పల్నాటి సత్యం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రామాలయ కమిటీ అధ్యక్షులు దిద్ది మోహన్ రావు మాట్లాడుతూ రామాలయ అభివృద్ధికి గ్రామస్తుల, ఉన్నతాధికారుల సహాయ సహకారులతోటి శాయశక్తుల కృషి చేస్తానన్నారు. రామాలయ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 07 Feb,2023 08:01PM