- తోటపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద వీరాపూర్ రైతుల అందోళన
- రైతులు సహకరించాలని ఏఈ బాలకిషన్ వివరణ
నవతెలంగాణ-బెజ్జంకి
వ్యవసాయ సాగుకు అధికారులు అంక్షలతో విద్యుత్ సరఫరా చేయడంపై రైతులు అసహనం వ్యక్తం చేశారు. బుధవారం మండల పరిధిలోని తోటపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ అధికారులు అంక్షలతో కూడిన విద్యుత్ సరఫరా చేయడాన్ని నిరసిస్తూ వీరాపూర్ రైతులు అందోళన చేశారు. ప్రభుత్వం ఒక వైపు వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతుంటే మరో వైపు అధికారులు అంక్షలతో విద్యుత్ సరఫరా చేస్తూ రైతుల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చేలా వ్యవహరిస్తున్నారని రైతులు అగ్రహం వ్యక్తం చేశారు. రైతుల అందోళనపై ఏఈ బాలకిషన్ వివరణ కోరగా సాంకేతిక కారణాల వల్ల అంక్షలతో కూడిన విద్యుత్ సరఫరా చేశామని.. విద్యుత్ సరఫరాలో తలెత్తున్న సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారని సహకారించాలని రైతులకు సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 08 Feb,2023 04:24PM