నవతెలంగాణ-భిక్కనూర్
గ్రామాలను అభివృద్ధి చేయడమే బిఆర్ఎస్ పార్టీ లక్ష్యమని ఎంపీపీ గాల్ రెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయ సమీపంలో 2 లక్షల రూపాయల ఎంపీటీసీ నిధులతో వేసిన బోర్ మోటారును పట్టణ సర్పంచ్ తునికి వేణుతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సహకారంతో మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సరస్వతి సువర్ణ ప్రభాకర్, ఆత్మ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, ఉప సర్పంచ్ బోడ నరేష్, ఆలయ కమిటీ చైర్మన్ అందే మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ నాగభూషణం గౌడ్, బిఅర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంబల్ల మల్లేశం, ఎంపీటీసీ ఉప్పల బాబు, వార్డు సభ్యులు కమ్మరి సుజాత, సిద్ధి రాములు, ప్రజా ప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm