వతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలో కంటి వెలుగు కేంద్రాన్ని బుధవారం ఎంపీపీ గాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కంటి పరీక్షలను చేస్తున్న వైద్య సిబ్బందితో మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేత్ర పరీక్షలు చేయాలని, ప్రజలకు కంటి పరీక్షలపై మరింత అవగాహన కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తునికి వేణు, ఆత్మ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, ఉప సర్పంచ్ బోడ నరేష్, ఆలయ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, బిఅర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంబల్ల మల్లేశం, నాయకులు సరస్వతి ప్రభాకర్, పంచాయితీ కార్యదర్శి సదాశివ్, వైద్య సిబ్బంది ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm