నవతెలంగాణ-కంటేశ్వర్
ఇటీవల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన 2023 - 24 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో దేశ ప్రగతిని సాధించాల్సిన యువతరాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విమర్శిస్తున్నామని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి అన్నారు. ఈ మేరకు బుధవారం బడ్జెట్ ప్రతులను డివైఎఫ్ఐ నిజామాబాదు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర బడ్జెట్లలో పూర్తిగా యువత ప్రస్తావన రాకపోవడం అవమానకరమని సిగ్గుపడాల్సిన పరిస్థితి అని దేశవ్యాప్తంగా కోట్లాదిమంది యువత డిగ్రీలు, పిజీలు, పూర్తిచేసుకుని నిరుద్యోగ సమస్యతో ప్రభుత్వం వైపు చూస్తున్న పరిస్థితుల్లో యువత అభివృద్ధికై, ఉపాధి కల్పనలకై, స్వయం ఉపాధి కల్పన రుణాల కై ప్రత్యేకంగా బడ్జెట్ ను కేటాయించాల్సింది.
పోయి, పూర్తిగా యువతను విస్మరించడం చాలా దుర్మార్గపు చర్య అన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా గ్రామాల్లో ప్రజలకు యువతకు ఉపాధిగా ఉన్న ఎం జి ఎన్ ఆర్ ఈజీఏ (MGNREGA)-2005 ఉపాధి పథకానికి 240,000, కోట్లు కేటాయించాల్సిన అవసరం ఉంది కానీ కేవలం 60 వేల కోట్లు మాత్రమే కేటాయించడం ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర కాదా అని ప్రశ్నించారు. ఏ ఒక్క యువత అభివృద్ధి కి సంబంధించిన అంశాలు ఈ బడ్జెట్లో లేకపోవడం బాధాకరం అన్నారు. దేశ ప్రగతిని సాధిస్తాం అభివృద్ధిలో పూర్తి సాధికారతను సాధిస్తాం అని గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్ వాలు యువతరాన్ని ప్రోత్సహించకుండా ఏవిధంగా సాధిస్తాయని ప్రశ్నించారు. యువతని విస్మరించిన ఈ బడ్జెట్ పూర్తిగా నిరుపయోగమైనదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిట్ల నరేష్, ఉపాధ్యక్షులు సాయి, కిరణ్, సహాయ కార్యదర్శి రాహుల్, నాయకులు మారుతి, బాలు, నవీన్లు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 08 Feb,2023 04:35PM