నవతెలంగాణ-కంటేశ్వర్
బిసి ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నూతన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ని బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించి స్వాగతం పలకడం జరిగింది. తదుపరి బిసిటియు నూతన సంవత్సర డైరీని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్షి రాఘవాపురం గోపాలకృష్ణ, అసోసియేటడ్ అధ్యక్షులు ఎ మోహన్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, డిచ్ పల్లి మండలం అధ్యక్షులు కొట్టాల రామకృష్ణ, మాక్లూర్ మండల బిసిటియు అధ్యక్షులు గంగోనె సంజీవ్, రాష్ట్ర గౌరవ సలహాదారులు రమణ స్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి నర్సయ్య, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm