నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, శివాజీ నగర్ మున్నూరు కాపు సంఘం సిడిపి ప్రొసీడింగులు అందజేశారు. శివాజీ నగర్ తర్పలోని 7 తర్పలకు కలిపి ఒక్కోక్క తర్పకి 5 లక్షల చొప్పున 35 లక్షల రూపాయలు, మున్నురుకాపు భవన నిర్మాణానికి ఎమ్మెల్యే కోట సిడిపి నిధులనుండి మంజూరు చేసి ప్రొసీడింగ్ కాపీలని సంఘ సభ్యులకి అందజేశారు.
ఎమ్మెల్యే కు మున్నూరు కాపులు ఘన స్వాగతం పలికి, గజమాలతో ఘనంగా సన్మానం చేసిన ఎమ్మెల్యే తోనే మున్నురుకాపులంతా ఐక్యంగా మీవెంటే ఉంటామని తెలిపారు. మున్నురుకాపు మహిళలకు తగు ప్రాధాన్యత కల్పిస్తున్న సంధర్భంగా మున్నురుకాపు మహిళ నేతలు, ఎమ్మెల్యే కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివాజీ నగర్ మున్నురుకాపు సంఘంలోని 7 తర్పలకి 35 లక్షలు, గాజుల్ పెట్ మున్నూరు కాపు సంఘం లోని 5 తర్పలకి 25 లక్షల కమ్యూనిటీ హల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని అన్నారు. మున్నూరు కాపుల స్వాగతనికి ఆనందం తో ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ మేయర్ ఆకుల సుజాత, బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, గాండ్ల లింగం, కార్పొరేటర్ లు, మున్నురుకాపు సోదరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 08 Feb,2023 04:38PM