నవతెలంగాణ-బెజ్జంకి
ఈ రోజు బెజ్జంకి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి అధ్యక్షతన తోట పల్లి, పోతారం గ్రామాల భారాస గ్రామ శాఖ అధ్యక్షులుగా కవ్వంపల్లి లక్ష్మణ్, పుట్ట సంపత్ గార్లను నియమించటం జరిగింది. ఆనంతరం వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ఫోరం మండల అధ్యక్షులు చింతల పల్లి సంజీవ రెడ్డి, ఎంపీటీసీ ల ఫోరం మండల అధ్యక్షులు దుంబాల రాజా మహేందర్ రెడ్డి, భారాస సోషల్ మీడియా ఇంఛార్జి ఎల శేఖర్ బాబు, భారాస మండల అధికార ప్రతినిధి బోనగిరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరక్టర్ దీటి రాజు,
రైతు సమన్వయ సమితి సభ్యులు ఎర్రవెల్లి శ్రీనివాస్,నాయకులు కుసుంబ సంపత్, జంగిటి శంకర్, పొన్నాల వీరేష్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 08 Feb,2023 05:14PM