నవతెలంగాణ-కంటేశ్వర్
స్థానిక విజయ్ హైస్కూల్లో ఫుడ్ఫిట్, క్రాఫ్ట్వేళా బుధవారం పాఠశాల ఆవరణంలో ఘనంగా నిర్వహించారు. వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటుచేసి, ముఖ్యఅతిథి నగర మేయర్ దండు నీతూకిరణ్ కరకమలములచే జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ ఫుడ్ మేళాను ప్రారంభించి ఆహారం యొక్క ప్రాముఖ్యత, సముతుల్యంలేని ఆహారం తీసుకున్నట్టయితే వచ్చే వివిధ రకాల జబ్బుల గురించి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించారు. విద్యార్థుల సృజనాత్మక శక్తిని, వారిని ప్రోత్సహిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని ఆమె అభినందించారు.
అనంతరం ఫుడ్ఫోట్లో భాగంగా 6వ తరగతి విద్యార్థులు ఏర్పాటు చేసుకున్నటువంటి వివిధ స్టాల్లో రకరకాల ఫుడ్ ఐటమ్స్ ని స్వీట్లు, స్నాక్స్, జ్యూస్, రైస్, మిర్చి, సమోస, గప్చుప్ మొదలైన ఆహార పదార్థాల రుచులను ఆస్వాదించారు. 7వ తరగతి విద్యార్థులు క్రాఫ్ట్, క్లే, వస్తువులను పరిశీలించి వారి నైపుణ్యతను మెచ్చుకోవడమే కాకుండా తనకు నచ్చిన క్రాఫ్టిని కొనుగోలు చేశారు. వెజిటేబుల్ కార్వింగ్ కూరగాయలను, పండ్లను ఉపయోగించి వివిధ రకాల జంతువులను, పక్షులను, పువ్వులను ఎంతో అందంగా, ఆకర్షణీయంగా తయారుచేశారనీ దండు నీతూకిరణ్ విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి డా. అమృతలత విద్యార్థులను ఉద్దేశించి ఫుడ్ ఫుడ్ఫిట్ ముఖ్యఉద్దేశం. విద్యార్థులు వంటశాలలో వారి మాతృమూర్తులకు వంటలో సహాయం చేయాలని అమ్మ కష్టాన్ని అర్థం చేసుకొని వివిధ రకాల వంటలు తయారుచేయమని తల్లులను వేధించవద్దనీ, తల్లిదండ్రులకు సహకరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ వి.ప్రభాదేవి, అకడమిక్ డైరెక్టర్ టి.వసంత, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ పి.సుజాత, ప్రిన్సిపాల్ విజేత మరియు 6,7 తరగతలు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 08 Feb,2023 05:17PM