నవతెలంగాణ -నవీపేట్
మండల కేంద్రంలో దోమల నుండి రక్షించాలని బిజెపి నవీపేట్ శాఖ ఆధ్వర్యంలో కార్యదర్శి గంగాధర్ కి బుధవారం వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల కేంద్రంలో దోమల బెడద తీవ్రంగా ఉందని దోమ కాటు వలన ప్రజలతో పాటు పిల్లలు మలేరియా, టైఫాయిడ్ మరియు డెంగ్యూ లాంటి వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని వెంటనే దోమల నివారణ మందులను పిచికారి చేయాలని లేనియెడల ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాధా, నాయకులు గణేష్, బాల గంగాధర్, రాజేందర్, రాము, బండారి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.