నవతెలంగాణ-గాంధారి
గాంధారి మండలంలోని బ్రమ్మాన్ పల్లి గ్రామం లో పద్మపనీ స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో రైతులకు వరి పంటలో తడి పొడి పై అవగాహన చేయడం జరిగింది ఈ సందర్భంగ సంస్థ మండల సమన్వయ కర్త పట్లోల్లా కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ మాయొక్క సంస్థ అధ్వర్యంలో రైతులు వరి పంటలో తడి పొడి విధానం అవలబించడం వల్ల వరి పంటలో దోమ పోటు, తగ్గడం, అధిక పిలుకలు, దిగుబడి పెరగడం వాంటి ఉపయోగాలు ఉంటాయి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో సంస్థ ప్రతినిది పట్లోళ్ళా కృష్ణమూర్తి, సర్పంచ్ లక్ష్మి బాలయ్య, వి ఆర్ ఎ వెంకట్ స్వామి, బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడు వేల్పుల నర్సింలు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బిస గణేష్,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm