నవతెలంగాణ- దుబ్బాక రూరల్
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లిలో (టీపీ ఫోక్ ఛానల్)తిమ్మప్ప ఫోక్ ఛానల్ చిత్ర యూనిట్ రెండు రోజులు (మంగళ, బుధ)సందడి చేసింది. టీపీ ఫోక్ ఛానల్ తిమ్మప్ప ఆధ్వర్యంలో తాగో తాగో అనే జానపద గేయాన్ని (అధ్య శ్రీ మ్యూజిక్ సీఈవో)పద్మనాభునిపల్లి మాజీ సర్పంచ్ ముక్కపల్లి శ్రీనివాస్ ,మాజీ ఉపసర్పంచ్ కండ్లకొయ్య స్వామి చరణ్ కొబ్బరికాయ కొట్టి షూటింగ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముక్కపల్లి శ్రీనివాస్,చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ ఈ జానపద గేయాన్ని తిరుపతి జవాను లిరిక్స్ రైటర్ రచించగా గాయకుడు సాకేత్ ఈ పాటకు తనగానంఅందించారు. ఈ పాటకు కొరియోగ్రాఫీ & డైరెక్టర్ శేఖర్ వైరస్ చేయగా కెమెరామెన్ అర్జున్ కొల్గుర్ షూటింగ్ ని చిత్రీకరించారు. కాగా ఈ షూటింగ్ లో హీరో హీరోయిన్లుగా కార్తీక్ రెడ్డి, శిరిషా నటించగా ఆర్ట్ డిపార్ట్మెంట్ చరణ్ ఈవెంట్స్ సేటపులతో చిత్రీకరణ జరిగింది. ఈ విషయం తెలుసుకుని గ్రామస్తులు, యువత పెద్ద ఎత్తున షూటింగ్ దగ్గరకు చేరుకుని వీక్షించి, ఆనందించారు. ఈ షూటింగ్ లో ప్రొడ్యూసర్ తిమ్మప్ప, సహాయ నటులు భవిత, మానస, దివ్య, ప్రవీణ్, సిద్దు తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 08 Feb,2023 06:35PM