నవతెలంగాణ-గాంధారి
గాంధారి మండలంలోనివివిధ గ్రామంలో నిర్వహించిన హత్ సేహత్ జోడో కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది గాంధారి మండలంలో చద్మల్ తండా, చద్మల్, నౌసిరం తండా, దుబ్బ తండా, నేరల్, నాగ్లుర్, నాగ్లుర్ తండా, నెరల్ తండా, గ్రామంలో కాంగ్రెస్ పార్టీ హత్ సే హత్ జోడో పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో గడపగడపకు తిరుగుతూ వడ్డేపల్లి శుభాష్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజెపి ప్రభుత్వాలు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇస్తూ పాదయాత్ర నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందని అదేవిధంగా నిత్యసర వస్తువుల ధరలు గానీ గ్యాస్ గాని డీజిల్ గాని పెట్రోల్ గాని అన్ని కూడా సామాన్య మానవునికి అందుబాటులో ఉంటాయని అంతే కాకుండా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రజలు రూపాయి రూపాయి ఇచ్చి ఈ నల్లమడుగు సురేందర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ని గెలిపిస్తే ఈ నియోజకవర్గ ప్రజల గుండెల మీద తన్ని కోట్ల రూపాయల బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయిన సురేందర్ కు రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా బుద్ధి చెప్తామని అన్నారు.
కావున కార్యకర్తలు అందరూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మదర్, వెంకట్ రెడ్డి, కామెల్లి బాలరాజు, లైన్ రమేష్, సంగెం రాజు, జశ్వంత్ గౌడ్, చిమ్మని సాయిలు, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 08 Feb,2023 06:40PM