- తస్లీమా మహమ్మద్ సబ్ రిజిస్టార్
నవతెలంగాణ-గోవిందరావుపేట
ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన మసిక సుభాష్ కుటుంబానిక అండగా ఉంటామని ములుగు భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్టర్ మహమ్మద్ అన్నారు. బుధవారం మండలంలోని పసర గ్రామంలో ఇటీవల రహదారి ప్రమాదంలో మృతి చెందిన మసిక సుభాష్ కుటుంబాన్ని తస్లీమా మహమ్మద్ పరామర్శించి సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ ఆధ్వర్యంలో50 కేజీల బియ్యం నిత్యవసర వస్తువులను సహాయంగా అందించారు. ముందుగా మహేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మహేష్ మృతి బాధాకరమని సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముందు ముందు మహేష్ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సబ్ రిజిస్టర్ తస్లీ మా మహమ్మద్ తో పాటు సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ సభ్యులు,గ్రామస్థులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 08 Feb,2023 07:13PM