నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని బుధవారం జిల్లా పరిషత్ సీఈవో ఎస్ ప్రసూనరాణి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. 2021- 22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రికార్డులను ఆమె పరిశీలించారు. రికార్డుల పరిశీలన అనంతరం కార్యాలయ సిబ్బందికి సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఈఓ ప్రసూనారాయణ వెంట అసిస్టెంట్ సౌమ్య ఉన్నారు. తనిఖీ నిర్వహణలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ కార్యాలయ సూపరిండెంట్ సాయి దుర్గా లక్ష్మి కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm