- తరలివచ్చిన భక్తులు.. కిక్కిరిసిన మేడారం
నవతెలంగాణ - తాడ్వాయి
మేడారంలో తిరుగువారం పండుగను పూజారులు బుధవారం ఘనంగా నిర్వహించారు. మేడారం మినీ జాతర ముగిసిన అనంతరం బుధవారం తిరుగువారం పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా పూజారులు తెల్లవారుజామున లేచి తలంటు- స్నానాలు ఆచరించి మేడారంలోని సమ్మక్క గుడి లో పూజార్ల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు, ఆడబిడ్డలు మహిళలు, కన్నేపళ్లి లోని సారలమ్మ గుడి లో సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య ఆధ్వర్యంలో పూజారులు, ఆడబిడ్డలు, మహిళలు, పసుపు, కుంకుమ బొట్లతో పూజించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పూజారులు గుడిని శుభ్రంగా శుద్ధి చేసి, రంగు రంగుల ముగ్గులతో అలంకరించి అందంగా ముస్తాబు చేశారు. అనంతరం పూజారులు వారి కుటు-ంబ సభ్యులు అందరూ హాజరై తిరిగివారం పండుగను ఘనంగా నిర్వహించారు. దీంతో మినీ జాతర ముగిసిపోతుంది. అనంతరం వచ్చే ఆదివారం పూజారులు గ్రామ ప్రజలు అందరూ కలిసి ఊరి బయటకు వనభోజనాలకు వెళ్లి వనదేవతలకు, తల్లులకు మేకలను, కోళ్లను నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.
మేడారంలో కిక్కిరిసిన జనం
మినీ మేడారం జాతర అనంతరం బుధవారం గురువారం పండుగ రోజున భక్తులు అధిక సంఖ్యలో హాజరై వనదేవతలను దర్శించుకున్నారు. జంపన్న వాగులో పుణ్య స్థానం ఆచరించి, కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి గద్దెల వద్దకు చేరుకొని వనదేవతలకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీర, సారే సమర్పించి ప్రత్యేకముక్కులు చెల్లించారు. అనంతరం కంకవనం లోకి చేరి వంట, వార్పు చేసుకుని, భోజనాలు ఆరగించిన అనంతరం తిరుగు ప్రయాణం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 08 Feb,2023 07:21PM