నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని పులాంగ్ సమీపంలో ఉన్న మెట్రో ఫుట్వేర్ షాప్ ఎదుట బుధవారం గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం కలకలం సృష్టించింది. మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు అందించారు. సమాచారం అందుకున్న 4వ టౌన్ ఎస్ఐ సందీప్ సంఘటనా స్థలానికి చేరుకొని ఎవరు గుర్తించకపోవడం గుర్తు తెలియని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడి వివరాలు తెలియలేవని ఒకవేళ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తిస్తే నాలుగవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సందీప్ కుమార్ 87126 59840 నంబర్కు తెలపాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm