నవతెలంగాణ - నవీపేట్
మండలంలోని యంచ కేదారేశ్వర ఆలయంలో స్పటిక లింగ పునః ప్రతిష్టాపన మహోత్సవాన్ని గురువారం నుండి శనివారం వరకు నిర్వహిస్తున్నట్లు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు బుధవారం తెలిపారు. బ్రహ్మశ్రీ శ్రౌతి మురళీధర్ శర్మ త్రయాణిక దీక్షతో స్మర్తగామ విధానముతో స్పటిక లింగ పునః ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై పరమేశ్వరుని కృపను పొందాల్సిందిగా కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm