నవతెలంగాణ-దుబ్బాక రూరల్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఫామాయిల్ సాగుకు రైతులు పెద్ద ఎత్తున దృష్టి సారించాలని, ఫామాయిల్ సాగుకు ప్రభుత్వం అందించే సబ్సిడీ రాయితీలు, ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని దుబ్బాక, మిరుదొడ్డి మండలాల ఉద్యాన శాఖ అధికారి ఆర్. బాలాజీ, దుబ్బాక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతల జ్యోతి సూచించారు.
సిద్దిపేట జిల్లా అక్బరుపేట్ - భూంపల్లి మండలంలోని పోతారెడ్డిపేట గ్రామ రైతు వేదికలో బుధవారం ఫామాయిల్ సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక మండలంతో పాటు అక్బరుపేట్ మండలంలో విలీనమైన (దుబ్బాక మండలానికి సంబంధించిన పలు గ్రామాల కలిపి) 320 ఎకరాల్లో ఈ ఫామాయిల్ సాగు జరుగుతుందన్నారు.
ఈ సాగులో రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీతో పాటు మార్కెటింగ్ సౌకర్యన్ని ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. ఈ పంటలతో పాటు రైతులు అంతర పంటల సాగు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. రైతులంతా కూడా ఆయిల్ పామ్ సాగుకు పెద్దఎత్తున ఆసక్తి చూపాలన్నారు. ఈ సాగు ద్వారా తెలంగాణ రాష్ట్రంలోనే స్వతహాగా వంట నూనెలు తయారు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో పోతారెడ్డి పేట ఎంపీటీసీ చంద్రసాగర్ , నగరం సర్పంచ్ , ఏఈవో అనూష, రైతులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 08 Feb,2023 07:26PM