నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లోని మాస్ కమ్యూనికేషన్ విభాగానికి చెందిన వంగాల సుధాకర్ డాక్టరేట్ ను సాధించారు"పబ్లిక్ రిలేషన్స్ ప్రాక్టీసెస్ ఇన్ సెంట్రల్, స్టేట్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ స్టేట్ "అనే అంశంపైన సమర్పించిన సిద్ధాంత గ్రంధానికి డాక్టరేట్ పొందారని ఉస్మానియా యూనివర్సిటీ కి చెందిన ఎక్సటర్నల్ ఎగ్జామినర్ ప్రోఫేసర్ కర్ణం నరేందర్ తెలిపారు. సుధాకర్ మాస్ కమ్యూనికేషన్ విభాగానికి చెందిన డాక్టర్ కంకట రాజారాం పర్యవేక్షణలో తన పరిశోధనను పూర్తి చేశారు. మాస్ కమ్యూనికేషన్ విభాగానికి చెందిన హెడ్ డాక్టర్ చంద్రశేఖర్, బివోస్ చైర్మన్ ప్రభంజన్ యాదవ్, మరియు శాంత బాయి తదితరులు హాజరయ్యారు.
మాస్ కమ్యూనికేషన్ లో అన్నబోయిన సంపత్ కుమార్ కు డాక్టరేట్..
తెలంగాణ యూనివర్సిటీ లోని మాస్ కమ్యూనికేషన్ విభాగానికి చెందిన అన్నబోయిన సంపత్ కుమార్ డాక్టరేట్ సాధించారు." సామాజిక అవగాహనను పెంపొందించడంలో ప్రజా సంబంధాల పాత్రలో సమాచార ప్రజా సంబంధాల విభాగం అధ్యయనం తెలంగాణ "అనే అంశంపైన సమర్పించిన సిద్ధాంత గ్రంధానికి డాక్టరేట్ పొందారని నాగార్జున యూనివర్సిటీ కి చెందిన ఎక్సటర్నల్ ఎగ్జామినర్ ప్రోఫేసర్ అనిత తెలిపారు. ఈయన మాస్ కమ్యూనికేషన్ విభాగానికి చెందిన డాక్టర్ గంటా చంద్రశేఖర్ పర్యవేక్షణలో తన పరిశోధనను పూర్తి చేశారు.మాస్ కమ్యూనికేషన్ విభాగానికి చెందిన అధ్యాపకులు డాక్టర్ ప్రభంజన్ యాదవ్, శాంతా బాయి, తదితరులు హాజరయ్యారు.
జైపాల్ నాయక్ కు డాక్టరేట్
అర్ధశాస్త్ర విభాగం లోని డాక్టర్ రవీందర్ రెడ్డి అసోసియేటెడ్ ప్రోఫేసర్ పర్యవేక్షణలో
" ఏ స్టడీ టూ ఎవల్యూట్ ది పర్ఫామెన్స్ ఆశ వర్కర్స్ ఇన్ ది ఇంప్రూమెంట్ ఆఫ్ హెల్త్ స్టేటస్ ఇన్ తెలంగాణ "అనే విషయంపై పరిశోధన చేసిన జైపాల్ నాయక్ పిహెచ్ డి మౌఖిక పరీక్ష తెలంగాణ యూనివర్సిటీ లోని అర్థశాస్త్ర విభాగంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఎక్సటర్నల్ ఎగ్జామినర్ గా ప్రొఫెసర్ పుల్లారావు ఆంధ్ర యూనివర్సిటీ హాజరయ్యారు. చైర్మెన్ బిఓఎస్ డాక్టర్ ఎ పున్నయ్య
డీన్ డాక్టర్ సుధాకర్రావు, హెడ్, డాక్టర్ సంపత్,పాత నాగరాజు, డాక్టర్ స్వప్న, శ్రీనివాస్, డాక్టర్ దత్తహరి
తదితరులు హాజరయ్యారు. ప్రోఫెసర్ పుల్లారావ్ ఎక్స్టర్నల్ ఎక్జమినర్ గా పరిశోధక విద్యార్థికి పలు ప్రశ్నలు అడిగి సమాధానాలకు సంతృప్తి చెంది డాక్టరేట్ ని ప్రకటించారు.జైపాల్ నాయక్ వికారాబాద్ జిల్లాలోని దౌల్తాబాద్ మండలం పుల్కంపల్లి గ్రామ పరిధిలోని కిష్టా నాయక్ తండ చెందిన పరిశోధక విద్యార్థికి అర్థశాస్త్రంలో డాక్టర్ పట్టాపొందడంతో పలువురు అభినందనలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 08 Feb,2023 07:35PM